Guntur Kaaram Trailer: గుంటూరు కారం ఘాటు ఎక్కించే అప్డేట్.!


Guntur Kaaram Trailer Release Date: దర్శకుడు త్రివిక్రమ్ అలాగే మహేష్ బాబు బ్లాక్ బాస్టర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా గుంటూరు కారం.. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదు అన్నపూర్ణ స్టూడియోలో శరవేగంగా జరుగుతుంది.. ఈ భారీ బడ్జెట్ సినిమాని ప్రొడ్యూసర్ నాగ వంశీ సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై తర్కెక్కిస్తున్నారు.. గుంటూరు కారం రిలీజ్ డేట్ దగ్గర పడటంతో సినిమా ప్రమోషన్స్ని టీజర్ అలాగే సాంగ్స్ తో మొదలు పెట్టడం జరిగింది అలాగే లేటెస్ట్గా అందుతున్న సమాచారం మేరకు మేకర్స్ గుంటూరు కారం ట్రైలర్ ని (Guntur Kaaram Trailer) రెడీ చేస్తున్నట్టు తెలుస్తుంది..

Guntur Kaaram Trailer Release Date: మహేష్ బాబు అలాగే త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇది మూడవ సినిమా కావటం విశేషం.. అలాగే గుంటూరు కారం సినిమాని సంక్రాంతి కానుకగా విడుదల చేయుటకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు మేకర్స్.. ప్రస్తుతం గుంటూరు కారం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది.. ఇప్పటికే ప్రమోషన్ల భాగంగా విడుదలైన మొదటి రెండు సాంగ్స్ ప్రేక్షకులకి మెప్పించలేకపోయాయి.. అయితే మహేష్ బాబు పూర్తిగా మాస్ రోల్ లో ఈ చిత్రంలో కనిపించబోతున్నాడు అనే అంశం మూవీకి మంచి బజ్ తీసుకువచ్చింది.

Guntur Kaaram Trailer Release Date is Here Guntur Kaaram Trailer Release Date and Pre Release Event Details

ఇక అసలు విషయానికి వస్తే గుంటూరు కారం ట్రైలర్ ని (Guntur Kaaram Trailer) జనవరి 6 తారీఖున ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ట్రైలర్ని విడుదల చేద్దామనే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్.. ఈ ట్రైలర్ తో సినిమాపై మరింత భారీ అంచనాలు పెంచే విధంగా అలాగే మహేష్ ఫ్యాన్స్ కి మూవీ లవర్స్ కి కూడా వాళ్ళ అంచనాలు తగ్గట్టుగా త్రివిక్రమ్ ట్రైలర్ ని కట్ చేయబోతున్నట్టు సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారము. కచ్చితంగా ఈ ట్రైలర్ తో సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ అమాంతం పెంచాలని అనుకుంటున్నారు.

శ్రీలీల అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా చేస్తున్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే గత త్రివిక్రమ్ సినిమాలకు అలా వైకుంఠపురం అరవింద్ సమేత తరహాలోనే గుంటూరు కారం సినిమాకి బెస్ట్ మ్యూజిక్ ఇస్తారని ఫ్యాన్స్ అందరు కోరుకున్నారు.. అయితే ఇప్పుడు దాకా విడుదలైన రెండు సాంగ్స్ తో తమన్ ఫాన్స్ ని మెప్పించలేకపోయాడు.

త్రివిక్రమ్ కూడా మహేష్ బాబు (Mahesh Babu) సినిమాతో పక్కా కమర్షియల్ సక్సెస్ అందుకోవాలని సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తీస్తున్నారు.. మరి విడుదలైన తర్వాత ఏ రేంజ్ రికార్డ్స్ సృష్టిస్తుందో చూడాలి.. అయితే మహేష్ బాబు పర్ఫామెన్స్ తో ఇరగదీయబోతున్నాడు అనే టాక్ ఇండస్ట్రీలో అయితే వినపడుతుంది.

Mahesh Babu and Trivikram next Guntur Kaaram Trailer Release Date, Guntur Kaaram Movie Trailer Release Date, Guntur Kaaram Shooting update, Sreeleela,



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *