నా స్వామి రంగ టీజర్ కి సూపర్ రెస్పాన్స్..హిట్ పక్కా.!


Naa Saami Ranga Teaser Review: కింగ్ అక్కినేని నాగార్జున నా స్వామి రంగ అనే ఫ్యామిలీ యాక్షన్ డ్రామా తో మన ముందుకు సంక్రాంతికి రాబోతున్నారు.. ఈ సినిమాని జనవరి 13న విడుదలకు సిద్ధం చేశారు మేకర్స్.. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకునే పనిలో ఉన్న మేకర్స్ సినిమా ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టడం జరిగింది.. ప్రమోషన్ లో భాగంగానే నా స్వామి రంగా టీజర్ ని విడుదల చేశారు. ఈ సినిమాలో అల్లరి నరేష్ అలాగే రాజ్ తరుణ్ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు.

Naa Saami Ranga Teaser Review: ఆషిక రంగనాథ్ హీరోయిన్గా చేస్తున్న ఈ సినిమాకి విజయ్ బిన్నీ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.. అయితే విడుదలైన టీజర్ కొన్ని గంటల్లోనే యూట్యూబ్ లో ట్రెండింగ్ గా మారి మిలియన్ వ్యూస్ పైనే సెన్సేషన్ క్రియేట్ చేసింది.. అంతేకాకుండా టీజర్ లో నాగార్జున (Nagarjun) యాక్షన్, డైలాగ్స్ అలాగే మిగతా తారాగణం సంబంధించిన ఇంట్రడక్షన్ కూడా ఇవ్వడం జరిగింది.. ఇప్పటి వరకూ 3 మిలియన్స్ కి పైగా వ్యూస్ వచ్చాయి.

నా స్వామి రంగా టీజర్ చూసిన తర్వాత నాగార్జున (Nagarjun) ఫ్యాన్స్ అలాగే మూవీ లవర్స్ సంక్రాంతికి పక్క హిట్ బొమ్మ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.. అలాగే ముందు ముందు రాబోయే ప్రమోషన్ కంటెంట్ అలాగే ట్రైలర్ తో సినిమాపై మరింత భారీ అంచనాలు నెలకొంటాయి అని మేకర్స్ కూడా భావిస్తున్నారు.

Naa Saami Ranga Teaser, Naa Saami Ranga Teaser Public talk, Nagarjuna, Ashika Ranganath, Allari Naresh Naa Saami Ranga shooting update,Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *